సీబీఎల్ లో రెచ్చిపోయిన తెలుగు థండర్స్
- November 12, 2016
సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌తో (సీసీఎల్) ప్రేక్షకులను ఫుల్ ఎంటర్టైన్ చేసిన సౌత్ స్టార్స్ ,సెలబ్రిటీ బ్యాడ్మింటన్ లీగ్(సీబీఎల్)తో మరింత అలరించారు. సౌంత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకు చెందిన పలువురు సెలబ్రిటీస్ సీబీఎల్లో పార్టిసిపేట్ చేసి ఈ గేమ్‌పై మరింత ఆసక్తిని కలిగించారు. సెప్టెంబర్ 24న మొదలైన ఈ లీగ్ నిన్నటితో పూర్తైంది. సౌత్ ఫిలిం ఇండస్ట్రీకి చెందిన స్టార్స్ చెన్నై రాకర్స్, కర్ణాటక ఆల్ప్స్, కేరళ రాయల్స్, టాలీవుడ్ థండర్స్ ఇలా నాలుగు గ్రూప్ లుగా విడిపోయి ఈ లీగ్ లో పాల్గొన్నారు. ఆద్యంతం ఆసక్తిగా సాగిన నిన్నటి ఫైనల్ లీగ్ లో టాలీవుడ్ థండర్స్ ఘన విజయాన్ని సాధించి తెలుగు వాడి సత్తా నిరూపించింది.
హైదరాబాద్, చెన్నై , కొచ్చి, బెంగళూర్ లో లీగ్ మ్యాచ్‌లను నిర్వహించగా నవంబర్ 12న కౌలాలంపూర్, మలేషియాలో ఫైనల్ మ్యాచ్ జరిగింది.
ఈ లీగ్‌లో మెన్స్ డబుల్, మిక్స్డ్ డబుల్ మరియు ఉమెన్స్ డబుల్ ప్రధాన కేటగిరీలుగా ఉన్నాయి. చెన్నై రాకర్స్ ఓనర్‌గా వెంకటేష్ ఉండగా బ్రాండ్ అంబాసిడర్‌గా మాధవన్ ఉన్నారు. టీమ్ మోటివేటర్‌గా అమలాపాల్ ఉంది. ఇక టాలీవుడ్ థండర్స్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా నాగ చైతన్య ఉంటే టీమ్ మోటివేటర్‌గా లక్ష్మీ మంచు, టీమ్ కెప్టెన్‌గా సుధీర్ బాబు, వైస్ కెప్టెన్‌గా తరుణ్, టీమ్ సపోర్టర్‌గా ఛార్మీ కౌర్‌లు ఉన్నారు.
ఇక టాలీవుడ్ థండర్స్ టీం విషయానికి వస్తే మేల్ ప్లేయర్స్‌లో నిఖిల్, కుషాల్ మండా, అనీల్, కృష్ణ చైతన్య, సత్యదేవ్, నవీన్ చంద్ర ఉన్నారు. ఫీమేల్ ప్లేయర్స్‌లో తేజస్వీ మడివాడా, సంజన గల్రానీ, అపూర్వ శ్రీనివాసన్, సీరత్ కపూర్లు ఉన్నారు. నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కేరళ రాయల్స్‌పై తెలుగు థండర్స్ విజయం సాధించడంతో మన టాలీవుడ్ సెలబ్స్ స్టేడియంలో ఫుల్ సందడి చేశారు. అందుకు సంబంధించిన వీడియోని మంచు లక్ష్మీ తన సోషల్ మీడియా పేజ్‌లో పోస్ట్ చేసింది. ఆ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







