మలయాళ నటి రేఖ మోహన్ అనుమానాస్పద మృతి

- November 13, 2016 , by Maagulf
మలయాళ నటి రేఖ మోహన్ అనుమానాస్పద మృతి

మలయాళ సినీ, టీవీ నటి రేఖా మోహన్‌ అనుమానాస్పద స్థితిలో మరణించింది. శనివారం కేరళలో త్రిసూర్‌ లోని రేఖ అపార్ట్‌ మెంట్‌ లో ఆమె మృతదేహాన్ని గుర్తించారు. రేఖ మృతికి కారణమేంటన్నది తెలియరాలేదు. పోలీసులు ఈ కోణంలో విచారణ చేస్తున్నారు. ఆమె పలు మలయాళీ సినిమాలు, టీవీ సీరియల్‌ లో నటించింది.

ఇంటికి దూరంగా ఉన్న రేఖ భర్త గత రెండు రోజులుగా ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదు. ఆయనకు సందేహం వచ్చి త్రిసూర్‌ పోలీసుల సాయం కోరాడు. పోలీసులు రేఖ అపార్ట్‌ మెంట్‌ కు వెళ్లి తలుపులు పగలకొట్టి చూడగా ఆమె మృతదేహం కనిపించింది. అపార్ట్‌ మెంట్‌ లోపల లాక్‌ చేసుకున్నట్టు పోలీసులు చెప్పారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం త్రిసూర్‌ మెడికల్‌ కాలేజీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

తమిళ సినీ పరిశ్రమలోనూ రెండు రోజుల క్రితం ఇలాగే విషాదకర సంఘటన చోటుచేసుకుంది. నటి సబర్ణ చైన్నైలోని తన ఫ్లాట్‌ లో మరణించినట్టు పోలీసులు కనుగొన్నారు. మూడు రోజుల క్రితం చనిపోయినట్టు తెలిపారు. ఆమె లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నట్టు గుర్తించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com