రీసైక్లింగ్ ప్లాంట్ యంత్రం మధ్య నలిగి దుర్మరణం చెందిన కార్మికుడు
- November 13, 2016
ప్లాస్టిక్ ను కరిగించి మరలా పునరుత్పత్తి చేసే ఒక ప్లాంట్ లో యంత్రం మధ్య ఒక నిర్వహణ కార్మికుడు ఇరుక్కొని లోపల నలిగి కరిగిపోయినట్లు అధికారులు పేర్కొన్నారు.
మారియన్ కౌంటీ కరోనీర్స్ కార్యాలయం తెలిపిన సమాచారం ప్రకారం మైఖేల్ అనే కార్మికుడు కాలిపోయి చనిపోయాడు అతని తల, శరీరం మొత్తం ప్లాస్టిక్ రీసైక్లింగ్ ద్రవంలో కరిగిపోయి చనిపోయినట్లు పేర్కొంటున్నారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిన దుర్ఘటనగా తెలిపారు.ఇండియానాపోలిస్ మెట్రోపాలిటన్ పోలీస్ శాఖ తెలిపిన వివరాల ప్రకారం 31 ఏళ్ల మైఖేల్ అనే కార్మికుడు గురువారం ఆ యంత్రాల నిర్వహణ సమయంలో అకస్మాత్తుగా యంత్రం మొదలై ఆ కార్మికుని లోపలకు లాక్కొనినట్లు చెప్పారు. అధికారులు కార్మికుని మరణంపై సమగ్ర దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇండియానాపోలిస్ స్టార్ ప్లాంట్ జనరల్ మేనేజర్ ఫ్రెడ్ రీడ్ నివేదిక ప్రకారం, ఈ యంత్రం పాత ప్లాస్టిక్ ను దట్టమైన గుళికలుగా మెత్తటి చూర్ణంగా చేస్తుందని, దాంతో తెలికైన ప్లాస్టిక్ చిత్రాన్ని ఫ్రేమ్‌లను మరియు ఇతర ప్లాస్టిక్ వస్తువుల తయారీకి వాటిని ఉపయోగిస్తారని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







