యూఏఈ ఎక్స్‌ఛేంజ్‌లో రూ.8,00,000 మార్పిడికి యత్నం

- November 13, 2016 , by Maagulf
యూఏఈ ఎక్స్‌ఛేంజ్‌లో రూ.8,00,000 మార్పిడికి యత్నం

యూఏఈలోని భారతీయ వలసదారులు మనీ ఎక్స్‌ఛేంజెస్‌ వద్ద పెద్ద మొత్తంలో ఇండియన్‌ కరెన్సీతో బారులు తీరారు. 500, 1000 నోట్లను భారత ప్రభుత్వం రద్దుచేసిన తరువాత, ఆ పాత నోట్లను మార్చుకునేందుకు వెసులుబాటు కల్పించడంతో తమ వద్దనున్న పాత కరెన్సీని మార్చుకునేందుకు యూఏఈలోనూ భారతీయ వలసదారులు పోటీపడుతున్నారు. ఓ వ్యక్తి, తన వద్దనున్న బ్యాగ్‌ని చూపించి అందులో 8,00,000 రూపాయలు ఉన్నాయనీ, వాటిని మార్చుకోదలచుకున్నానని మనీ ఎక్స్‌ఛేంజ్‌ అధికారులతో చెప్పాడు. దాంతో వారు షాక్‌కి గురయ్యారు. పెద్ద మొత్తంలో డబ్బుని ట్రాన్స్‌ఫర్‌ చేసుకునే అవకాశం ఉన్నా, ఇప్పుడున్న పరిస్థితుల్లో 2,00,000 రూపాయల సొమ్ము సబబుగా ఉంటుందని మనీ ఎక్స్‌ఛేంజ్‌ స్టాఫ్‌ ఒకరు తెలిపారు. అయితే వీటిల్లో చాలావరకు బ్లాక్‌ మనీ ఉండవచ్చనీ, కొంత మేర ఫేక్‌ కరెన్సీ ఉండవచ్చునన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బ్లాక్‌ మనీని అడ్డుకునేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్య సబబేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇండియన్‌ ఎంబసీ అధికారులు ఈ విషయంపై మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ బ్లాక్‌మనీని అరికట్టే చర్యలకు మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com