అన్‌రిజర్వ్‌డ్‌ టికెట్లను ఈ-వాలెట్‌ ద్వారా బుక్ చేసుకోండి

- November 13, 2016 , by Maagulf
అన్‌రిజర్వ్‌డ్‌ టికెట్లను ఈ-వాలెట్‌ ద్వారా బుక్ చేసుకోండి

త్వరలో పేటీఎం, జియోమనీ, ఎయిర్‌టెల్‌మనీ లాంటి ఈ-వాలెట్‌ సర్వీసుల ద్వారా అన్ రిజర్వ్‌డ్‌ టికెట్ల బుకింగ్‌ సౌకర్యాన్ని కల్పించనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా కాగిత రహిత మొబైల్‌ టికెటింగ్‌ను పెంచేందుకు ఈ-కామర్స్‌ రంగంపై రైల్వేశాఖ దృష్టిసారించింది.

రిజర్వేషన్‌ లేని టికెట్ల ఫారమ్‌ల నిర్వహణ సమస్యగా తయారైందని పేపర్‌లెస్‌ వ్యవస్థ దిశగా అడుగులేసేందుకే ఈ-వాలెట్‌లోకి ప్రవేశిస్తున్నట్లు తెలిపింది. టికెట్లను విక్రయించిన ఈ-వాలెట్‌ సంస్థల నుంచి రైల్వేకి కమీషన్ల రూపంలో ఆదాయం సమకూరనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com