బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని బాలలకు అవార్డులు ..
- November 14, 2016
టీనేజ్ పారాలింపిక్ స్విమ్మర్ కుమారి రేవతి నాయక్, చెస్ క్రీడాకారుడు దేవ్ షా.. నేషనల్ చైల్డ్ అవార్డులు అందుకున్నారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ చేతులమీదుగా వీరు ఈ అవార్డులు అందుకున్నారు. మ్యూజిక్, స్పోర్ట్స్, ఆర్ట్స్, నూతన ఆవిష్కరణలు, చదువు విభాగాల్లో అత్యంత ప్రతిభ కనబరిచిన మొత్తం 31 మంది బాలలకు ఈ అవార్డులను అందజేశారు.16ఏళ్లకే స్విమ్మింగ్‌లో అత్యుత్తమ ప్రతిభ కనపరుస్తున్నందుకుగాను నాయక్‌కు బంగారు పతకాన్ని అందించారు. అలాగే చెస్‌లో ప్రతిభ కనబరుస్తున్న తొమ్మిదేళ్ల దేవ్ షాకు ఎక్స్‌లెన్స్ అవార్డును అందజేశారు.రాజీవ్ గాంధీ మానవ్ సేవ అవార్డును బిహార్‌కు చెందిన దేవేష్నాథ్ దీక్షిత్, ఝార్ఖండ్‌కు చెందిన బందన కుమారి, కేరళకు చెందిన ఎస్. ఏసు అందుకున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి మేనకా గాంధీ తదితరులు హాజరయ్యారు.
తాజా వార్తలు
- అత్యంత వైభవంగా గీతం 17వ స్నాతకోత్సవం
- NEET UG 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
- అమెరికా వీసాల పై ట్రంప్ సర్కార్ కఠిన నిర్ణయం
- కేరళ: కొండచరియలు విరిగిపడి 8 మంది మృతి..
- లండన్‌లోని ప్రముఖ రెస్టారెంట్లో షేక్ మొహమ్మద్ సందడి..
- బాక్సింగ్‌లో ఏకంగా 7 స్వర్ణాలు సాధించిన భారత్!
- జలీబ్లో ఉక్కుపాదం.. 1,253 మంది అరెస్ట్..!!
- ఒమాన్‌లో ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చిన కీలక మార్పులు..!!
- అమెరికాలో సౌదీ రక్షణ శాఖ సహాయ మంత్రి..కీలక చర్చలు..!!
- ఘనంగా ప్రారంభమైన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు..







