డిసెంబరు 16న 'ఎస్ 3'...
- November 14, 2016
సూర్య నటించిన 'ఎస్ 3' చిత్రాన్ని కేరళలో ఆయన అభిమానులే విడుదల చేయనున్నట్లు సమాచారం. హరి దర్శకత్వంలో సూర్య నటించిన సీక్వెల్ చిత్రం 'ఎస్ 3'. ఇందులో అనుష్క, శ్రుతిహాసన్‌లు కథానాయికలు. ఇటీవల విడుదలైన టీజర్‌ను ఏకంగా 4 మిలియన్ల మంది చూశారు. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుగుతున్నాయి. డిసెంబరు 16వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. కేరళలో 'సొప్నం ఫిలిమ్స్ సంస్థ'తో కలిసి 'సింగం గ్రూప్ తిరుచ్చూర్' అనే అభిమానుల సంఘం దీన్ని విడుదల చేస్తోంది. దీనిపై సూర్య అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఈ విషయం తమకూ ఎంతో గర్వంగా ఉందని చిత్రబృందం అంటోంది. ఈ చిత్రానికి హ్యారీస్ జయరాజ్ సంగీతం సమకూర్చారు. స్టూడియోగ్రీన్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించింది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







