డిసెంబరు 16న 'ఎస్‌ 3'...

- November 14, 2016 , by Maagulf
డిసెంబరు 16న  'ఎస్‌ 3'...

సూర్య నటించిన 'ఎస్‌ 3' చిత్రాన్ని కేరళలో ఆయన అభిమానులే విడుదల చేయనున్నట్లు సమాచారం. హరి దర్శకత్వంలో సూర్య నటించిన సీక్వెల్‌ చిత్రం 'ఎస్‌ 3'. ఇందులో అనుష్క, శ్రుతిహాసన్‌లు కథానాయికలు. ఇటీవల విడుదలైన టీజర్‌ను ఏకంగా 4 మిలియన్ల మంది చూశారు. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుగుతున్నాయి. డిసెంబరు 16వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. కేరళలో 'సొప్నం ఫిలిమ్స్‌ సంస్థ'తో కలిసి 'సింగం గ్రూప్‌ తిరుచ్చూర్‌' అనే అభిమానుల సంఘం దీన్ని విడుదల చేస్తోంది. దీనిపై సూర్య అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఈ విషయం తమకూ ఎంతో గర్వంగా ఉందని చిత్రబృందం అంటోంది. ఈ చిత్రానికి హ్యారీస్‌ జయరాజ్‌ సంగీతం సమకూర్చారు. స్టూడియోగ్రీన్‌ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com