మంత్రి జోగు రామన్న క్లాప్‌తో ప్రారంభమైన "బంజారా టైగెర్స్"

- November 15, 2016 , by Maagulf
మంత్రి జోగు రామన్న క్లాప్‌తో ప్రారంభమైన

జి 9 ఫిలిమ్స్ పతాకంపై సలీమ్, పాఠక్ హీరో హీరోయిన్లుగా ఫయీమ్ సర్కార్ దర్శకత్వంలో సమీనా యాస్మిన్ నిర్మాతగా "బంజారా టైగెర్స్ " చిత్రం ఆదివారం ఆదిలాబాద్ మెయిన్ సెంటర్ అంబెడ్కర్ చౌక్ లో అత్యంత భారీజన సందోహం మధ్యలో ఘనంగా  ప్రారంభం అయింది. ఈ చిత్రానికి తొలిషాట్ కి సలీమ్, పాఠక్, ప్రసన్నకుమార్, జబర్దస్త్ అప్పరావు లపై తెలంగాణ మంత్రి జోగురామన్న క్లాప్ నివ్వగా, ఆదిలాబాద్ ఏం ఎల్ ఏ రేఖ నాయక్ కెమెరా స్విచాన్ చేసారు. తొలిషాట్ కి శ్యాంనాయక్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు ఫయీమ్ సర్కార్ మాట్లాడుతూ..... మా "బంజారా టైగెర్స్ "మూవీ ఇంత భారీగా ఓపెనింగ్ జరుపుకోవటం ఆనందంగా ఉందని, నలుగురు యువకులు జల్సాగా తిరుగుతూ అనుకోకుండా నక్షలైట్ ముద్రతో జైలుకు వెళ్లి తిరిగి వచ్చి ఉరికి ఏమి చేసారు, ఊరు మనకేమి ఇచ్చింది కన్నా ఊరుకి మనమేమి చేసాం అనే కాన్సెఫ్ట్ తో మంచి ఎంటర్ టెన్మెంట్ గా రూపొందిస్తున్నమ్మన్నారు. ఈ చిత్రం ఈ రోజు నుండి 15రోజులు పాటు ఆదిలాబాద్ పరిసర ప్రాంతాలలో ప్రిస్ట్ షెడ్యూలు పూర్తి చేసి సెకండ్ షెడ్యూలు డిసెంబర్ లో హైదరాబాద్ పాటలను వైజాగ్, కాశ్మీర్ లో చిత్రీకరిస్తంమన్నారు. నిర్మాత సమీనా యాస్మిన్ మాట్లాడుతూ... ఈ చిత్రంలో ఆరు పాటలు ఉంటాయని నాగునాయక్ సంగీత సారధ్యంలో రికార్డింగ్ పూర్తిచేశామన్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేవిధంగా ఉంటుందన్నారు. నటుడు ప్రసన్నకుమార్ మాట్లాడుతూ... ఈ మధ్య కాలంలో ఇంత భారీ ఓపెనింగ్ చూడటం ఇదే అన్నారు. ఈ సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. మరో నటుడు జబర్దస్త్ అప్పారావు మాట్లాడుతూ...ఈ చిత్రంతో నాకు మంచి గుర్తింపు లభిస్తుందని ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com