డ్యు మై అకౌంట్‌తో 200,000 దిర్హామ్‌లు గెల్చుకోవచ్చు
- November 15, 2016
డ్యు సంస్థ, మాస్టర్ కార్డ్‌తో కలిసి సంయుక్తంగా ఓ క్యాంపెయిన్‌ని ప్రారంభించింది. ఆన్‌లైన్ బిల్ పేమెంట్స్ మరియు రీచార్జ్‌లను మై అకౌంట్ - మోర్ రివార్డింగ్ ద్వారా చేసేందుకు అవకాశం కల్పిస్తూ, ఆ విషయానికి విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. ఆన్ లైన్ ద్వారా ఈ సదవకాశాన్ని వినియోగించుకునేవారు ఆటోమేటిక్‌గా, డ్రాలో పాల్గొనేందుకు అర్హత సంపాదించనున్నారు. నవంబర్ 10 నుంచి డిసెంబర్ 10 వరకు వినియోగదారులు మాస్టర్ కార్డ్ ద్వారా మై అకౌంట్‌ని వినియోగించుకుని బిల్స్ చెల్లించడం, రీచార్జ్ చేసుకోవడం వంటివాటి ద్వారా బహుమతుల్ని గెలుచుకునేందుకు అర్హత సాధిస్తారు. 50,000 దిర్హామ్‌ల మెగా ప్రైజ్ చెక్‌తోపాటు 30 గిఫ్ట్ కార్డ్ ప్రైజులు (300 దిర్హామ్‌ల నుంచి 2,500 దిర్హామ్‌ల విలువ గలవి) ఈ బహుమతుల కేటగిరీలో ఉన్నాయి. మొత్తం 121 బహుమతులు, వాటి 200,000 దిర్హామ్‌లు కావడం గమనించదగ్గది. మై అకౌంట్ ద్వారా వినియోగదారులు తమ డేటా యూసేజ్ లిమిట్‌ని మార్చుకోవడం, బిల్ హిస్టరీని తెలుసుకోవడం, లైవ్ డేటాని చూసుకోవడం, ఎస్‌ఎంఎస్ మరియు కాల్ యూసేజ్‌పై అవగాహన పెంచుకోవడం వంటి సౌకర్యాలు పొందవచ్చు. డ్యు వెబ్‌సైట్‌లో మరిన్ని వివరాల్ని పొందుపర్చారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్‌రౌండర్.. !
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!
- అబుదాబి–రియాద్ విమాన సర్వీసులు రద్దు.. అక్టోబర్ 19 వరకు నిలిపివేత
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన







