'కార్తికేయ' సినిమా రీమేక్ లో యంగ్ హీరోలు పోటీ...

- November 15, 2016 , by Maagulf
'కార్తికేయ' సినిమా రీమేక్ లో యంగ్ హీరోలు పోటీ...

చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా వచ్చిన 'కార్తికేయ' సినిమా ఘనవిజయం సాధించింది. ఈ సినిమాను కన్నడలో రీమేక్ చెయ్యడానికి ప్రయత్నాలు జరుపుతున్నారు. తెలుగులో సరైన హిట్ లేక కన్నడలో ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్న హీరో ఆది ఈసినిమాతోనే ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నాడట. మరో వైపు అభిషేక్ వర్మ అనే యంగ్ హీరో కూడా కన్నడలో రీమేక్ అయ్యే కార్తికేయకు సిద్ధమవుతున్నాడట.ఆయన తండ్రే దీనికి నిర్మాతగా వ్యవహరించనున్నాడని చెబుతున్నారు. ఈ సినిమాకు 'కుమారస్వామి' అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు సమాచారం.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com