'రోబో 2.ఓ'లో మాయా
- November 15, 2016
సంగీత దర్శకుడు జేమ్స్ వసంత్ దర్శకత్వం వహించిన 'వానవిల్ వాళ్‌క్కై' సినిమా ద్వారా పరిచయమైన నటి మాయా. అందులో అల్లరి అమ్మాయి పాత్రలో కనిపించారు. వ్యాయామ శిక్షకురాలు, శిలంబాట్టం కళాకారిణి, గాయని, నాట్య కళాకారిణి.. ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె ప్రస్తుతం రజనీకాంత్ నటిస్తున్న '2.ఓ'లో ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. దీని గురించి మాయా మాట్లాడుతూ.. నేను నటిగా, గాయనిగా మారడం యాదృచ్ఛికంగా జరిగిన సంఘటనలే. నాకు తెలిసినంత వరకు నటన అనేది డబ్బును ఆర్జించే మార్గం కాదు. వ్యక్తిగా నా ప్రత్యేకతను చాటుకునేందుకు ఓ వేదికగా భావిస్తున్నా.
నేను కాలుమోపే ప్రతీ రంగంలోనూ ఉన్నతస్థాయిని పొందాలన్నదే నా లక్ష్యం. అంతేకాకుండా ఆ విభాగంలో ఇతరులకు స్ఫూర్తిదాయకంగానూ మారాలని అనుకుంటానని చెప్పారు. '2.ఓ' కాకుండా బ్రహ్మ దర్శకత్వంలో జ్యోతిక నటిస్తున్న 'మగళీర్ మట్టుం' సినిమాలో కూడా మాయా కీలకపాత్ర పోషిస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







