తెలంగాణ లో డిజిటల్ క్లాసులు ప్రారంభించిన కేటీఆర్
- November 16, 2016
తెలంగాణ డిజిటల్ క్లాస్ ప్రసారాలు ప్రారంభమయ్యాయి. బుధవారం ఉదయం మనటీవీ సాఫ్ట్‌నెట్ స్టూడియోలో మంత్రులు కడియం శ్రీహరి, కేటీఆర్ డిజిటల్ క్లాస్ ప్రసారాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ తెలంగాణ విద్యాశాఖ మరో మైలురాయిని అధిగమించిందన్నారు. 5,415 ఉన్నత పాఠశాలలకు 3,352 పాఠశాల్లో డిజిటల్ క్లాసులు నిర్వహిస్తారని తెలిపారు. దశలవారీగా ప్రభుత్వ పాఠశాల్లో ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. తెలంగాణ విద్యార్థులు చదువుల్లో ముందుండాలన్నదే తమ ఆకాంక్ష అని స్పష్టం చేశారు. డిజిటల్ క్లాసులను టీచర్లు వినియోగించుకోవాలని కడియం శ్రీహరి సూచించారు. మధ్యతరగతి వర్గాలకు ఐటీ ఫలితాలు అందాలన్నదే తమ ప్రయత్నం అని మరో మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ విప్లవం కొనసాగుతోందన్నారు. మిషన్ భగీరథ పైప్‌లైన్‌తో పాటు ఫైబర్ ఆప్టికల్ లైన్లు వేస్తామని, ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్‌తో పాటు ఇంటర్నెట్ కూడా అందాలని తెలిపారు. కుటుంబంలో ఒక్కరైనా డిజిటల్ అక్షరాస్యులు కావాలని మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!







