లింగ సమానత్వం కోసం యుఏఈ లో కొత్త చట్టాలు

- November 16, 2016 , by Maagulf
లింగ సమానత్వం కోసం  యుఏఈ లో కొత్త చట్టాలు

 దుబాయ్ : సమాజంలో మహిళలు పాల్గొనే తీరు క్రమేపి పెరిగిందని ముఖ్యంగా యుఏఈలో అధిక  ప్రాధాన్యత ఉందని ఉప ప్రధాన మంత్రి మరియు ప్రెసిడెన్షియల్ వ్యవహారాల మంత్రి షేక్ మంసౌర్ బిన్ జాయెద్ భార్య షేక్ మనల్ బిన్తె ముహమ్మద్ మంగళవారం తెలిపారు. 

ఈ లక్ష్యాలను చేరుకోవాలంటే  చట్టం మరియు మహిళలు మద్దతిచ్చే విధానాల వినియోగం ద్వారా సాధించవచ్చని  యుఏఈ లింగ సమానత్వ సంతులన కౌన్సిల్ మరియు దుబాయ్ మహిళా ఏర్పాటు అధ్యక్షురాలు షెఇఖ మనల్ చెప్పారు. మహిళా అక్షరాస్యత, విద్యా స్థాయిలను పరిశీలిస్తే ప్రపంచ ప్రఖ్యాత దేశాలలో యుఏఈ సైతం ఒక దేశంగా ఎదగడానికి  వెనుక ప్రధాన కారణాల్లో ఒకటిగా చెప్పవచ్చని జెండర్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ద్వారా గ్యాప్ నివేదిక ప్రకారంగా ఇది నిరూపితమైందని అన్నారు.యుఏఈ లో మహిళలకు ఇంతటి విశేషమైన విజయాలు లభించడానికి ప్రధాన కారణం దేశం యొక్క అభివృద్ధిలో  స్త్రీ పురుషులకు సమాన అవకాశాలు అందజేస్తూ తగిన ప్రాముఖ్యత ఇస్తున్న మన నాయకులకు మహిళల పట్ల బలమైన నమ్మకం లేకుండా ఈ ఘనత  సాధ్యమయ్యేది కాదని షెఇఖ మనల్  అభిప్రాయపడ్డారు. స్త్రీ , పురుషలకు సమాన అవకాశాలు ఇస్తూ వివిధ రంగాల్లో యుఏఈ యొక్క పురోగతి ఆవిష్కరణ మరియు నిరంతర విజయాలు సాధించడానికి  ఈ ప్రాధాన్యత ఆధారపడి ఉంటుంది. నాయకులు ప్రజల అందరి  హక్కులకు సమాన ప్రాధాన్యత ఇస్తూ ముఖ్యంగా మహిళల్లో ఎటువంటి వివక్ష లేకుండా సమాజంలో వైవిధ్యం గల వివిధ పాత్రల్లో ఒక అవకాశం ఇవ్వాలని ఆమె కోరారు. కౌన్సిల్ ఇటీవల పని ప్రణాళిక మరియు  ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడం గూర్చి సంబంధిత అంశాలు చర్చించడానికి ఇటీవల సమావేశమయ్యారు. ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం లింగ అసమానతకు తావులేని సూచికలో కొంత కాల వ్యవధిలోగా ప్రముఖ దేశాల జాబితాలో ప్రముఖ 25 ర్యాంకుల్లో యుఏఈ సైతం ఒక దేశంగా ఉంచే  లక్ష్యంతో యుఎఇ లింగ సమతుల్యత కార్యక్రమం అనుసరిస్తుందని ఆమె అన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com