పెద్దనోట్ల రద్దు ప్రభావం విదేశీ పర్యాటకులపై.....!
- November 16, 2016
పెద్దనోట్ల రద్దు ప్రభావం విదేశీ పర్యాటకులపైనా బాగానే పడింది. ఈనెల 8న అమెరికా నుంచి తన స్నేహితులతో దిల్లీ వచ్చిన రెట్ అనే పర్యాటకుడు డాలర్లను రూపాయలతో మార్పిడి చేసుకున్నాడు. అయితే, భారత ప్రధాని నరేంద్రమోదీ పెద్దనోట్లను రద్దు చేస్తూ హఠాత్తుగా చేసిన ప్రకటనతో రెట్, తదితరుల వద్ద ఉన్న భారత్ కరెన్సీ ఎందుకూ పనికి రాకుండా పోయింది. తాము బసచేసిన హోటళ్ల వారు ఆ నోట్లను స్వీకరించలేదని రెట్ చెప్పారు. కరెన్సీ మార్పిడి వసతి కూడా లేకపోవడంతో తాము దిక్కుతోచని స్థితిలో పడ్డామన్నారు. చివరకు తాము హాజరైన ఓ భారతీయుల పెళ్లిలో ఇచ్చేశామన్నారు. .బ్రిటన్ నుంచి వచ్చి పర్యాటకురాలు ప్యాట్రీషియా హేమ్స్ కూడా ఇదే తరహా పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.ట్యాక్సీలకు చెల్లించాలంటే కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నామని చెప్పారు. సాధ్యమైనంత వరకూ క్రెడిట్ కార్డు ద్వారానే పనులన్నిటినీ పూర్తి చేస్తున్నట్లు చెప్పారు. అయితే, స్థానిక మార్కెట్ల నుంచి చిన్నచిన్న వస్తువులు కొనుక్కుందామంటే చేతిలో డబ్బు చాలక ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు. కళాఖండాల కొనుగోలూ ఇబ్బందికరంగా తయారైందన్నారుతన తల్లితో కలిసి బ్రెజిల్ నుంచి వచ్చిన ఆక్టావియో ఫ్రాంకో కూడా నానా అగచాట్లూ పడుతున్నారు. ఏటీఎంల దగ్గర చాంతాడంత క్యూలు ఉంటున్నాయ న్నారు. చాలా మంది విదేశీ పర్యాటకులు ఇలాంటి ఇబ్బందులే పడుతున్నారు. ఉజ్బెకిస్థాన్ నుంచి వచ్చిన అజీజ్ కరీంది కూడా ఇంచుమించు ఇలాంటి అనుభవమే.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









