ఇమ్మిగ్రేషన్ అధికారుల్లా స్కామర్స్
- November 17, 2016
మనామా: బహ్రెయిన్ నివాసితులు, ఇమ్మిగ్రేషన్ అధికారుల్లా వేషం మార్చిన కొందరు స్కామర్స్‌తో అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఇమ్మిగ్రేషన్ అధికారులమని చెబుతూ ఫోన్ కాల్ ద్వారా రెసిడెంట్స్‌ని బెదిరించి, వారి నుంచి పెద్దమొత్తాల్లో కొందరు వసూలు చేస్తున్నట్లు అధికారుల దృష్టికి వెళ్ళింది. ఇలా ఎవరైనా ఫోన్ కాల్ చేసినప్పుడు తక్షణం పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు. స్మితా షైజు అనే వ్యక్తి ఇదే తరహాలో ఫోన్ కాల్ని ఎదుర్కొన్నారు. ఇమ్మిగ్రేషన్ నెంబర్ తరహాలోనే వారు ఫోన్ చేసిన నెంబర్ ఉందని స్మిత వెల్లడించారు. వారికి తన నెంబర్ ఎలా తెలిసిందో అర్థం కాలేదనీ, తనపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు బెదిరించారనీ, పేమెంట్ డ్యూస్ చెల్లించకపోతే కఠిన శిక్షలు తప్పవని చెప్పారని ఆమె వివరించారు. స్పూఫ్ కాలర్ ఐడి ద్వారా ఇలాంటి స్కామర్స్ అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు అధికారులు వెల్లడించారు. రెసిడెంట్స్ అప్రమత్తంగా ఉండటంతోపాటు, ఇమ్మిగ్రేషన్ అధికారులమని ఎవరైనా కాల్ చేసినప్పుడు వ్యక్తిగత వివరాలు వెల్లడించరాదని అధికారులు సూచించడం జరిగింది.
తాజా వార్తలు
- UAE participates in 12th GCC Labour Minister’s Committee meeting in Bahrain
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..







