దుబాయ్ విద్యార్ధులకు పోలీసుల ట్రాఫిక్ పాఠాలు
- August 29, 2015
కొత్త పాఠశాల విద్యా సంవత్సరం ప్రారంభoలోగా, విద్యార్ధుల భద్రతకై దుబాయ్ పోలీసు వారు ఒక సమగ్ర ప్రణాళికను సిద్ధం చేశారు. ఈ సందర్భంగా దుబాయి పోలీసు ట్రాఫిక్ జనరల్ డైరక్టరేట్ యొక్క ఆక్టింగ్ డైరక్టర్ కల్నల్ జమాల్ మొహమ్మద్ అల్ బన్నాయ్- ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ, వేగాన్ని అదుపులో ఉంచు కోవాలని, ఓవర్ టేక్ చేయవద్దని, పాఠశాలల వద్దనున్న పదచరుల మార్గం వద్ద చాలా అప్రమత్తంగా ఉండాలని వాహనదారులకు, ముఖ్యంగా స్కూల్ బాస్ డ్రైవర్లకు విజ్ఞప్తి చేశారు. ఇంకా, తల్లిదండ్రులకు వాహనం నడుపుతున్నపుడు పిల్లలతో మాట్లాడవద్దని, రోడ్డు మధ్యలో లేదా వ్యతిరేక దిశలో వారిని విడిచిపెట్టరాదని తల్లిదండ్రులను కోరారు. విద్యా సంవత్సరం ఆరంభంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను, ఉపన్యాసాలను తయారుచేశామని, పిల్లల అవగాహన కార్యక్రమాల్లో భాగంగా పోలీసు వారు పాఠశాలల్లో వివిధ పోటీలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







