వెర్రి వెంగళప్ప
- August 29, 2015
ఒక ఊరిలో ఒక అమాయకుడు ఉండేవాడు. వారిని అందరూ వెంగళప్ప అనేవారు. అది వాడికి అర్ధమయ్యేది కాదు. ఒక ఇంట్లో పని చేసేవాడు. సడెన్‌గా వారు పని మాన్పించేశారు. ఏమైందో వాడికి అర్ధం కాలేదు. అలా వెళ్తూ రోడ్డు మీద పని కోసం తిరుగుతూ ఉన్నాడు. అలా అలా వెళ్తూ ఒక ఇంటి ముందు ఆగి ఏదైనా పని ఉంటే ఇప్పించడయ్యా! అని అడిగింది. ఇంతకు ఎక్కడైనా పని చేశావా? అని అడిగాడు ఆ యజమాని. చేసేవాడ్ని వారు ఎందుకో మాన్పించేశారు అన్నాడు. నువ్వు అక్కడ ఏం చేసేవాడివి అని అడిగాడు. అక్కడ యజమానికి ఒక రోజు కాళ్లు నొప్పి అంటే కాళ్లు పట్టాను. చాలా బాగుందన్నాడు. మరో రోజు నడుం నొప్పి అన్నాడు, నడుం పట్టాను బాగుందని మెచ్చుకున్నాడు. మరో రోజు భుజాల నొప్పి అన్నాడు. భుజాలు కూడా నొక్కాను చాలా బాగుందని మెచ్చుకున్నాడు. ఒకరోజు మెడనొప్పి అన్నాడు మెడ కూడా గట్టిగా పిసికాను. అంతే ఇంక అతను ఆ రోజు నుండీ లేవడం మానేశాడు. ఇంట్లో వాళ్లు నన్ను తన్ని తరిమేశారు ఇదీ సంగతి బాబు అన్నాడు. ఆ యజమానికేమో పని అవసరం వాడ్ని పనిలో పెట్టుకోవాలని అనుకున్నాడు. నా దగ్గర ఇలాంటి పిచ్చిపనులు చెయ్యకుండా జాగ్రత్తగా పని చేసుకో అని చెప్పాడు. నేనిప్పుడు ఏం పని చెయ్యాలయ్యా అని అడిగాడు వెంగళప్ప. మొదట నాకు మూడేళ్ల కొడుకు ఉన్నాడు. వాడిని అలా బయటికి తీసుకెళ్లి ఆడించి తీసుకురా అన్నాడు. వాడ్ని తీసుకెళ్లి, కొంత సేపటికి ఒక్కడే తిరిగి వచ్చాడు వెంగళప్ప. నా కొడుకేడీ అని అడిగితే వాడు మొదట ఇసుకలో ఆడతానన్నాడు. వదిలేశాను. తరువాత గడ్డిలో ఆడతానన్నాడు వదిలేశాను. తరువాత రోడ్డు మీద ఆడతానన్నాడు వదిలేశాను. అక్కడి నుండి వచ్చి బావిలో ఆడుకుంటానన్నాడు వదిలేసి బావికి బయట నిలబడ్డాను. వాడు ఎప్పటికీ రాకపోగా నాకు పని వేస్ట్ అయిపోతుందని వచ్చేశాను. ఇప్పుడేం పని చెయ్యాలయ్యా అని అడిగాడు వెర్రి వెంగళప్ప. దాంతో ఆ యజమాని గుండెలు బాదుకుంటూ బావి దగ్గరకు పరుగెత్తాడు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







