అజ్మన్ లో భవనంపై నుండి కిందకు పడిన ప్రవాసీయుడు

- November 18, 2016 , by Maagulf
అజ్మన్ లో భవనంపై నుండి కిందకు పడిన ప్రవాసీయుడు

దుబాయ్: బుధవారం ఒక నివాస భవనం యొక్క కిటికీ నుండి ఓ యువకుడు కిందకు పడిపోయాడు ప్రస్తుతం ఆ వ్యక్తి అత్యవసర విభాగంలో కోలుకొంటున్నాడు .ఆసియా దేశానికి చెందిన ఆ యువకుడు అజ్మన్ లో అపార్ట్మెంట్ లోని మూడవ అంతస్తు నుండి జారిపోయినట్లు ఆసుపత్రిలోని అధికారులు తెలిపారు. అజ్మన్ పోలీస్ కార్యకలాపాలు గదికి ఈ సంఘటన గూర్చి ఒక సమాచారం అందిందని వెంటనే స్పందించి పోలీసు మరియు పారామెడిక్స్ విభాగాన్ని సంఘటన స్థలానికి పంపింది.బాధితుడిని హుటాహుటిన షేక్ ఖలీఫా హాస్పిటల్ లోనికి తరలించారు. ఈ ప్రమాదంలో యువకునికి  కాళ్లు, నడుము మరియు వెన్నెముకకు తీవ్రమైన గాయాలు అయ్యాయని అక్కడ ఆస్పత్రి అధికారులు పేర్కొన్నారు. సకాలంలో ఆ యువకుడిని ఆసుపత్రికి తీసుకురావడంతో ప్రాణాలతో బయటపడ్డారు  బాధితుడు ఏ ఏ గా  గుర్తించబడ్డారు, విరిగిన ఎముకులను సరిచేసేందుకు శస్త్రచికిత్స చేశారు. ఒక బలహీనపడిన స్థితిలో ఉన్న ఆ యువకుడిని  ఆసుపత్రి నిర్వాహకులు పారామెడిక్స్ వేగంగా స్పందించిన కారణంగా ఆ  యువకుడి ప్రాణరక్షక పాత్రలో వారు ముఖ్య భూమిక పోషించారు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com