అమరావతికి రూ. 17,500 కోట్లు రుణం

- November 18, 2016 , by Maagulf
అమరావతికి రూ. 17,500 కోట్లు రుణం

రాజధాని నిర్మాణానికి రూ. 17,500 రుణం ఇచ్చేందుకు అంతర్జాతీయ సంస్థలు అంగీకారం తెలిపాయి. 2018 డిసెంబర్ నాటికి సీడ్ క్యాపిటల్‌ల్లో తొలి దశ నిర్మాణాలు పూర్తి చేసేందుకు హడ్కో, ప్రపంచ బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్, బ్రిటన్ ప్రభుత్వాలు రుణాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. స్విస్ ఛాలెంజ్ పద్దతిలో టెండర్లను జనవరి కల్లా పూర్తి చేసి మార్చిలో నిర్మాణాలను ప్రారంభించాలని సీఆర్‌డీఏ లక్ష్యంగా పెట్టుకుంది. రాజధానిలో ఒక్క గ్రామాన్ని కూడా కదిలించకుండా వరదలు, విపత్తులను తట్టుకునే విధంగా నిర్మాణాలు చేపడుతున్నామని సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీధర్ తెలిపారు. భూ సమీకరణకు ముందుకురాని 1500ల ఎకరాలను భూ సేకరణ ద్వారా తీసుకోవాలని సీఆర్‌డీఏ నిర్ణయించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com