బహ్రెయిన్ లో తెలుగు పద్మశాలి సమాజం రక్షాబంధన్ వేడుకలు :::::

- August 29, 2015 , by Maagulf
బహ్రెయిన్ లో తెలుగు పద్మశాలి సమాజం రక్షాబంధన్ వేడుకలు :::::

అన్న చెల్లెళ్ళ లేదా అక్క తమ్ముళ్ళ ప్రేమానురాగాలుకు సూచకం గ ఈ పండుగును జరుపుకుంటారు . ఈ పండుగను తెలుగు పద్మశాలి సమాజం ఆధ్వర్యం లో చాలా ఆనందుత్శావాల మధ్య రక్షాబంధన్ వేడుకలు  జరుపుకున్నారు . ఈ కార్యక్రమము లో ఒకరికి ఒకరు రాఖీలు కట్టుకుంటూ   శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు . ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ మామిడేళ్ళ ప్రభాకర్ గారు మరియు కృష్ణ వేముల దంపతులు దీపారాధన చేసారు . ఇందులో భాగంగా సంజీవ్ కుమార్ ప్రారంభ ఉపన్యాసం చేసారు. అందరు కలసిమెలిసి ఈ పండుగును జరుపు కోవడం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అని చెప్పారు.గంగాధర్ అల్లే, సుదర్శన్ గంగుల గారు మాత్లాడుతూ ఇంత మంది మధ్య లో  లాంటి కార్య క్రమాలు జరుపు కోవాడం శుభ పరిణామము అన్నారు .

 

మున్ముందు ఇంకా ఎన్నో కార్యక్రమాలుకు ఇది వేదిక గ కావాలన్నారు . అలాగే ప్రతిఒక్కరు సహాయ సహకారాలు ఎంతో అవసరం అని చెప్పారు . క్రిష్ణ వేములా గారు మాట్లాడుతూ రక్షాబంధనం జంధ్యాల పూర్ణిమ శ్రావణ పూర్ణిమ వరుణ పూజ గురించి క్లుప్తము గా వివరించారు . అలాగే శ్రవణ పూర్ణిమ నాడు జరుపుకునే రాఖీ సోదర  ప్రేమ కి సంకేతం . అక్కా లేదా చెల్లెలు సోదరుని చేతికి రాఖి కట్టి పదికాలాల పాటు చల్లగా ఉండాలని మనసార కోరుకుంటుంది తమ సుఖాన్ని సంతోషాన్ని కోరుకునే సోదరుని ఫై సహజం గానే అన్నదమ్ములకి ఆత్మీయత బల పడుతుంది ఆమెను జీవితాంతం రక్షించడానికి కంటికి రెప్పల కాపాడటానికి సిద్దంగా ఉంటారు . అలాగే సంప్రదాయం కుటుంబ సంబంధాలకు పెద్దపీట వేసింది. తల్లిదండ్రులు, అక్కచెల్లెళ్లు, సోదరులు...ఇలా అందరి మధ్య ఆప్యాయత, అనురాగాలు పెనవేసుకుని ఉంటాయి. మానవ సమాజాన్ని దిశానిర్దేశం చేసేది ధర్మం. వేదాలు మనిషి మనుగడకు మార్గనిర్దేశం చేశాయి. వాటిని తూచాతప్పకుండా ఆచరించడమే మనిషి కర్తవ్యం. కుటుంబ బాధ్యత ఈ ధర్మాల్లో ఒకటి. తల్లిదండ్రులతోపాటు సోదరిని చూసుకోవాల్సిన బాధ్యత అన్నపై ఉంటుంది. వాస్తవానికి రక్షణ కోరిన సీ్త్రకి రక్షాకవచంగా నిలుస్తానని అభయమివ్వడమే రాఖీ పండగ పరమార్థం. తనకు రక్షణగా నిలిచే సోదరుడు కలకాలం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో నిత్యసంతోషంతో జీవించాలని కోరుకుంటూ సోదరి కట్టే తోరం (దారం) రాఖీ. తన క్షేమాయుర్థాయం కోసం నిరంతరం తపించే సోదరి రక్షణకు అనుక్షణం కట్టుబడి ఉంటానని సోదరుడు భరోసా ఇవ్వడం ఆశీర్వాదం. ఇదే రక్షాబంధన్‌ ముఖ్య ఉద్దేశంగా  ఈ కార్య క్రమము లో కార్యవర్గ సభ్యులు మామిదేల్ల ప్రభాకర్, సంజీవ్  కుమార్, ఎనుగందుల  గంగాధర్, ఆల్లే  సుదర్శన్, గంగుల క్రిష్ణ, మదాసు క్రిష్ణ, వేముల రతన్, నందగిరి, గంగాధర్, జలగం పాల్గున్నారు . 

 

--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com