ఫ్లూ వాక్సినేషన్ క్యాంపెయిన్ పొడిగింపు
- November 18, 2016
రియాద్: దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ని మరో 14 రోజులపాటు పొడిగించారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచనల మేరకు, అలాగే పబ్లిక్ డిమాండ్ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. సీజనల్ ఫ్లూ సమస్యలు తలెత్తకుండా ప్రతి ఒక్కరూ ఈ వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుంది. అన్ని వయసులకు చెందిన ప్రజలు, హెల్త్ అధికారులు, గర్భిణీ స్త్రీలు, డయాబెటిస్, రీనల్ ప్రోబ్లమ్స్, హార్ట్ మరియు థొరాసిక్ డిసీజెస్ వంటి వ్యాధులతో బాధపడుతున్నవారికి కూడా వ్యాక్సినేషన్ తప్పనిసరి. 150కి పైగా వాహనాల్ని మెడిక్స్, పారా మెడిక్స్‌తో ఈ వాక్సినేషన్‌ని నిర్వహిస్తున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కింగ్‌డమ్‌లోని అన్ని ముఖ్యమైన ప్రాంతాల్లోనూ ఈ వ్యాక్సినేషన్ని అందుబాటులో ఉంచారు. చలి కాలంలో విజృంభించే ఫ్లూ నుంచి విముక్తి కోసం 1.5 మిలియన్ ప్రజలకు వ్యాక్సినేషన్లు అందించాలని మినిస్ట్రీ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతి సీజన్లోనూ ఫ్లూ కొత్తగా తనను తాను మార్చుకుంటుందనీ, దాంతో ఆరోగ్యవంతులు కూడా ఫ్లూ బారిన పడి తీవ్ర ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఆకస్మికంగా వచ్చే జ్వరం, గొంతు నొప్పి, తలనొప్పి, చలి, నీరసం వంటివి ఇన్ఫ్యుయెంజా లక్షణాలుగా చెప్పవచ్చు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







