23వ తేదీన నాని సినిమా లాంచ్....

- November 18, 2016 , by Maagulf
23వ తేదీన నాని సినిమా లాంచ్....

నాని కథానాయకుడిగా ప్రస్తుతం 'నేను లోకల్' సినిమా రూపొందుతోంది. డిసెంబర్ 25న ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వెంటనే నాని మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. డీవీవీ దానయ్య నిర్మించనున్న ఈ సినిమాకి, శివకుమార్ దర్శకత్వం వహించనున్నాడు. ఈ నెల 23వ తేదీన ఈ సినిమాను లాంచ్ చేయనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో కథానాయికగా నివేదా థామస్ ను ఎంపిక చేసుకున్నారు. డిసెంబర్‌లో గానీ జనవరిలో గాని ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com