అమెరికాలో కుప్పకూలిన విమానం, నలుగురు మృతి
- November 20, 2016
అమెరికాలో జరిగిన విమాన ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. ఉత్తర నెవెడాలో ఎయిర్ అంబులెన్స్ విమానం కూలిపోవడంతో శుక్రవారం రాత్రి ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. గుండె సంబంధిత వ్యాధితో బాధ పడుతున్న రోగిని ఉతాహ్ ఆస్పత్రికి తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రెండు ఇంజిన్లు కలిగిన ఈ విమానం కాసినో సమీపంలోని ప్రైవేటు మైనింగ్ కంపెనీకి చెందిన పార్కింగ్ ప్రదేశంలో కూలిపోయింది. దీంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. రోగితో పాటు విమానంలో ఉన్న ముగ్గురు సిబ్బంది సజీవ దహనమయ్యారు. మృతుల్లో మహిళ కూడా ఉన్నారు. సాంకేతిక లోపం కారణంగానే విమానం కూలిపోయివుంటుందని అనుమానిస్తున్నారు. ఈ విమానం రెనోకు చెందిన అమెరికన్ మిడ్ ఫ్లైట్ సంస్థకు చెందినది. ప్రమాదంపై ప్రభుత్వ దర్యాప్తు సంస్థల విచారణకు సహకరిస్తామని మిడ్ ఫ్లైట్ సంస్థ తెలిపింది. అయితే మృతుల పూర్తి వివరాలు వెల్లడికాలేదు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







