హెలికాప్టర్ నుంచి దూకే స్టంట్ చేస్తూ మరో హీరో మృతి
- November 20, 2016
జేమ్స్ బాండ్ స్టంట్‌మాన్, మాజీ ఎస్ఏఎస్ హీరో స్టీవ్ ట్రుగ్లియా గురువారం దుర్మరణంపాలయ్యారు. 300 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న హెలికాప్టర్ నుంచి స్టంట్ చేస్తూ దూకడంతో ఈ ప్రమాదం జరిగింది. తూర్పు లండన్‌కు చెందిన 54 ఏళ్ళ ట్రుగ్లియా నైరుతి చైనాలోని చోంగ్‌కింగ్‌లో చేసిన స్టంట్ ఆయన మరణానికి కారణమైంది. ట్రుగ్లియాకు ప్యారాచూటింగ్, పర్వతారోహణలో అనేక పురస్కారాలు లభించాయి. 100 మీటర్ల అబ్‌సీల్ స్టంట్‌ను అత్యంత వేగంగా చేసి ప్రపంచ రికార్డు సృష్టించారు. స్టంట్స్ చేయడం ప్రపంచంలో అత్యుత్తమ పని అని ఆయన అంటూ ఉండేవారు. 'టుమారో నెవర్ డైస్', 'వరల్డ్ ఈజ్ నాట్ ఇనఫ్' వంటి జేమ్స్ బాండ్ చిత్రాల్లోనూ, 'సేవింగ్ ప్రైవేట్ రియాన్' అనే హాలీవుడ్ క్లాసిక్స్‌లోనూ ఆయన నటించారు. ఇటీవల బెంగళూరులో కన్నడ సినిమా షూటింగ్‌లో క్లైమాక్స్ చిత్రీకరణ సమయంలో ఇటువంటి ఘటనే జరిగి, ఇద్దరు నటులు మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా ట్రుగ్లియా కూడా హెలికాప్టర్ నుంచి దూకి ప్రాణాలు కోల్పోవడం గమనార్హం.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







