నవంబర్ 27న విడుదల కాకునున్న సింగం 'ఎస్‌3' పాటలు

- November 20, 2016 , by Maagulf
నవంబర్ 27న విడుదల కాకునున్న సింగం 'ఎస్‌3'  పాటలు

సూర్య, అనుష్క, శ్రుతిహాసన్ హీరోహీరోయిన్లుగా మాస్‌ చిత్రాల దర్శకుడు హరి తెరకెక్కిస్తున్న 'ఎస్‌3'ను డిసెంబర్‌ మూడో వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు నిర్మాతలు రెండు నెలల క్రితమే అధికారికంగా ప్రకటించేశారు. ఆ దిశగానే పోస్టుప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుతున్నారు. అలాగే ప్రమోషన్లు కూడా ప్రారంభించాలని చిత్ర బృందం నిర్ణయించింది. ఇందులో భాగంగా 'ఎస్‌3' ఆడియోను ఈనెల 27న విడుదల చేయబోతున్నట్లు వారు తెలిపారు. స్టూడియోగ్రీన్ బ్యానర్‌పై కేఈ జ్ఞానవేల్‌ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రానికి హారీస్‌ జయరాజ్‌ సంగీతం సమకూరుస్తున్నారు. ఠాకూర్‌ అనూప్‌సింగ్‌, రాధారవి, నాజర్‌, సుమిత్ర, యువరాణి, రాధిక శరతకుమార్‌, క్రిష్‌, సూరి తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com