బోయపాటి, బెల్లంకొండల సినిమా ప్రారంభం

- November 20, 2016 , by Maagulf

బెల్లంకొండ శ్రీనివాస్‌, రకుల్‌ప్రీత్‌సింగ్‌ నాయకానాయికలుగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ద్వారక క్రియేషన్స్‌ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్న నూతన చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలైంది. తన తొలి చిత్రం భద్ర మొదలుకుని సరైనోడు వరకు తాను రూపొందించిన ప్రతీ సినిమాలోని తొలి సన్నివేశాన్ని హైదరాబాద్‌లోని గచ్చిబౌలి వనదేవత గుడిలో చిత్రీకరించడం బోయపాటికి సెంటిమెంట్‌.

అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈ తాజా చిత్రం షూటింగ్‌ను కూడా అక్కడే మొదలుపెట్టారు బోయపాటి. ఇందులో భాగంగా బెల్లంకొండ శ్రీనివాస్‌, రకుల్‌పై కీలకమైన సన్నివేశాల్ని చిత్రీకరించారు. ఈ సందర్భంగా నిర్మాత రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ, 'మా సంస్థలో రూపొందుతున్న రెండో చిత్రమిది. ఓ మంచి కాంబినేషన్‌లో వైవిధ్యమైన కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తుండటం ఆనందంగా ఉంది. ప్రస్తుతం మిగతా నటీనటుల ఎంపిక జరుగుతోంది' అని చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: ఎం.రత్నం, కెమెరా: ఋషి పంజాబి, సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, కళ: సాహి సురేష్‌, కూర్పు: కోటగిరి, స్టంట్స్‌: రామ్‌, లక్ష్మణ్‌.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com