హీరోగా నటించనున్న అరవింద్ స్వామి
- November 20, 2016
తన రీ ఎంట్రీని ఘనంగా ప్రారంభించారు ప్రముఖ నటుడు అరవింద్ స్వామి. 'కడల్', 'తని ఒరువన్'ల తర్వాత 'బోగన్'లో నటించారు. ప్రస్తుతం 'చదురంగ వేట్టై-2'లో త్రిషతో కలిసి తెరను పంచుకుంటున్నారు. ఈ చిత్రాలన్నింటిలోనూ వైవిధ్య పాత్రల్లో కనిపించేందుకు అరవింద్ స్వామి ప్రయత్నించారు. ఇప్పుడు సెల్వ దర్శకత్వంలో హీరోగా కనిపించనున్నారట. క్రైం కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ డిసెంబరు 16వ తేదీన చెన్నైలో ప్రారంభం కానుంది. ఇప్పటికే తలైవాసల్, అమరావతి, కర్ణా, నాన్ అవనిల్లై వంటి సుమారు 20 చిత్రాలకు దర్శకత్వం వహించారు సెల్వ.
ఈ చిత్రాన్ని 'నాన్ అవనిల్లై' బాణీలో అయిదుగురు హీరోయిన్లతో ఆయన రూపొందిస్తున్నారు. ఓ పాత్రకు ఇనియా ఇప్పటికే ఎంపికైంది. ఇతర పాత్రల కోసం మరికొందరితో చర్చలు కొనసాగుతున్నాయి. అయిదుగురు ముద్దుగుమ్మల్లో అరవింద్ స్వామికి జోడీగా ఎవరు నటిస్తారనేది ఇంకా ఖరారు కాలేదు. కథ మాత్రం చాలా వైవిధ్యంగా ఉంటుందని చిత్రవర్గాలు పేర్కొంటున్నాయి. కథ విన్న వెంటనే అరవింద్ స్వామి ఒప్పుకోవడం చూస్తేనే ఈ విషయం స్పష్టం అవుతోందని చెబుతున్నాయి.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







