హీరోగా నటించనున్న అరవింద్‌ స్వామి

- November 20, 2016 , by Maagulf
హీరోగా నటించనున్న అరవింద్‌ స్వామి

తన రీ ఎంట్రీని ఘనంగా ప్రారంభించారు ప్రముఖ నటుడు అరవింద్‌ స్వామి. 'కడల్‌', 'తని ఒరువన్‌'ల తర్వాత 'బోగన్‌'లో నటించారు. ప్రస్తుతం 'చదురంగ వేట్టై-2'లో త్రిషతో కలిసి తెరను పంచుకుంటున్నారు. ఈ చిత్రాలన్నింటిలోనూ వైవిధ్య పాత్రల్లో కనిపించేందుకు అరవింద్‌ స్వామి ప్రయత్నించారు. ఇప్పుడు సెల్వ దర్శకత్వంలో హీరోగా కనిపించనున్నారట. క్రైం కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్‌ డిసెంబరు 16వ తేదీన చెన్నైలో ప్రారంభం కానుంది. ఇప్పటికే తలైవాసల్‌, అమరావతి, కర్ణా, నాన్‌ అవనిల్లై వంటి సుమారు 20 చిత్రాలకు దర్శకత్వం వహించారు సెల్వ.

ఈ చిత్రాన్ని 'నాన్‌ అవనిల్లై' బాణీలో అయిదుగురు హీరోయిన్లతో ఆయన రూపొందిస్తున్నారు. ఓ పాత్రకు ఇనియా ఇప్పటికే ఎంపికైంది. ఇతర పాత్రల కోసం మరికొందరితో చర్చలు కొనసాగుతున్నాయి. అయిదుగురు ముద్దుగుమ్మల్లో అరవింద్‌ స్వామికి జోడీగా ఎవరు నటిస్తారనేది ఇంకా ఖరారు కాలేదు. కథ మాత్రం చాలా వైవిధ్యంగా ఉంటుందని చిత్రవర్గాలు పేర్కొంటున్నాయి. కథ విన్న వెంటనే అరవింద్‌ స్వామి ఒప్పుకోవడం చూస్తేనే ఈ విషయం స్పష్టం అవుతోందని చెబుతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com