ఇండియన్‌ ఎంబసీ కాన్సులర్‌ సేవలు ఔట్‌సోర్సింగ్‌కి?

- November 20, 2016 , by Maagulf
ఇండియన్‌ ఎంబసీ కాన్సులర్‌ సేవలు ఔట్‌సోర్సింగ్‌కి?

ఇండియన్‌ ఎంబసీ కాన్సులర్‌ సేవల్ని ఔట్‌ సోర్సింగ్‌కి ఇచ్చేందుకు సంబంధించి తమ ప్లాన్స్‌ని వెబ్‌సైట్‌లో పొందుపర్చింది. ఖతార్‌లో మూడు ప్రాంతాల్లో ప్రైవేటు ఏజెన్సీల ద్వారా ఈ సేవల్ని అందించేందుకు ఆలోచనలు చేస్తున్నట్లు అంబాసిడర్‌ పి.కుమరన్‌ ఇటీవలే ఇండికేషన్స్‌ కూడా ఇచ్చారు. కాన్సుల్‌ సేవల్ని పొందేందుకు ఇదొక సులభతరమైన మార్గంగా తాము విశ్వసిస్తున్నట్లు ఆయన తెలిపారు. చాలావరకు కాన్సుల్‌ సేవలు ఔట్‌ సోర్సింగ్‌ చేయబడతాయనీ, ముఖ్యమైన అటెస్టేషన్స్‌ మాత్రం ఎంబసీలోనే చేయబడ్తాయని ఆయన తెలిపారు. అల్‌ హిలాల్‌ లేదా పరిసర ప్రాంతాల్లో, సల్వా రోడ్‌ లేదా ఇండిస్ట్రియల్‌ ఏరియా మరియు అల్‌ ఖోర్‌ టౌన్‌ తదితర ప్రాంతాల్లో కొత్త ప్రైవేటు ఏజెన్సీలను ఏర్పాటు చేసి, అక్కడ కాన్సుల్‌ సేవలు అందేలా చర్యలు తీసుకోబోతున్నారని సమాచారమ్‌. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com