'నమో నరేంద్రమోడీ' - చంద్రబోస్ పాట
- November 21, 2016
నల్లధనం, ఫేక్ కరెన్సీ ముసుగులో అక్రమార్కులు దేశంలో సమాంతర ఆర్థిక వ్యవస్థను నడుపుతూ దేశ అభివృద్ధికి తూట్లు పొడుస్తున్నారు. ఇటువంటివారి భరతం పట్టేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అదే పెద్ద నోట్ల రద్దు. 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసి, వాటి స్థానంలో 500 రూపాయలతోపాటు 2000 రూపాయల నోట్లను తీసుకొచ్చింది కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం. ఇది సాహసోపేతమైన నిర్ణయం. దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రక్షాళనకు ఈ నిర్ణయం ఎంతగానో దోహదపడుతుంది. మోడీ తీసుకున్న ఈ నిర్ణయంతో కొన్ని సమస్యలు ఎదురవుతున్నా అవి తాత్కాలికమే. దేశ భవిష్యత్తును దృష్టిలోపెట్టుకుని ప్రతి ఒక్కరూ ఈ నిర్ణయానికి మద్దతు పలుకుతున్నారు. ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్, సినిమాల్లో కమర్షియల్ గీతాలు మాత్రమే కాకుండా, ఆలోచింపజేసే గీతాలను కూడా రచించారు. ప్రధాని నరేంద్రమోడీ తీసుకున్న సాహసపేత నిర్ణయానికి ముగ్ధుడై, తన మనసులోని భావాన్ని చంద్రబోస్ పాటగా మార్చారు. ఈ పాటని రామ్‌చరణ్ హీరోగా రూపొందిన 'ధృవ' సినిమా కోసం టైటిల్స్‌లో వాడనున్నారని మాగల్ఫ్.కామ్ కు తెలియ జేశారు. ఆ పాట మీకోసం..
https://youtu.be/dWlEpDrip4M
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







