ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్లకు ఆన్లైన్ ఆక్షన్
- November 21, 2016
మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, ఆరవ ఆన్లైన్ ఆక్షన్‌ని ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్ల కోసం సిద్ధం చేస్తోంది. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మెట్రాష్2 అప్లికేషన్ ద్వారా రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి నవంబర్ 24 రాత్రి 10 గంటల వరకు ఆక్షన్‌లో పాల్గొనవచ్చు. దీనికోసం సెక్యూరిటీ డిపాజిట్ కింద 20,000 ఖతారీ రియాల్స్ చెల్లించాల్సి ఉంటుంది. బిడ్డింగ్ 100,000 ఖతారీ రియాల్స్ నుంచి ప్రారంభమవుతుంది. ఆక్షన్‌లో విజయం సాధించినవారు రెండు పనిదినాల్లో చెల్లించాల్సిన పూర్తి పేమెంట్ని క్లియర్ చెయ్యాల్సి ఉంటుంది. లేనిపక్షంలో, అతని తర్వాతి స్థానంలో ఉన్నవారిని ఎంపిక చేస్తారు. ఆక్షన్‌లో 333300, 331333, 331331, 393399, 422244 వంటి ఫ్యాన్సీ నెంబర్లు ఉన్నాయి. మరోపక్క మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్, యాన్యువల్ కాప్రహెన్సివ్ క్వశ్చనీర్ని విడుదల చేసింది. స్కూళ్ళు, మరియు విద్యార్థుల పెర్ఫామెన్స్‌ని ఎస్సెస్ చేయడం దీని ఉద్దేశ్యం. క్వశ్చనీర్ ఆధారంగా డేటాబేస్‌ని తయారు చేసి, దాన్ని మినిస్ట్రీకి అందజేస్తారు. రెండో ఫేస్ క్వశ్చనీర్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేస్తారు. స్టూడెంట్స్, పేరెంట్స్ మరియు టీచర్స్ని ఉద్దేశించి ఈ కశ్చనీర్ ఉంటుంది. ఇదిలా ఉండగా వక్రాలో విదామ్ ఫుడ్ బ్రాంచ్ ప్రారంభమైంది.వక్రాలోని అబ్దుల్ రహమాన్ బిన్ జస్సిమ్ కమర్షియల్ స్ట్రీట్‌లో దీన్ని ప్రారంభించారు. పలు రకాలైన మీట్ ప్రొడక్ట్స్ ఇక్కడ లభ్యమవుతాయి.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







