భారతదేశంలో రైలు ప్రమాద మరణాల పట్ల సంతాపం వ్యక్తం

- November 21, 2016 , by Maagulf
భారతదేశంలో  రైలు ప్రమాద మరణాల పట్ల సంతాపం వ్యక్తం

మనామా : బహ్రేయినీ నాయకత్వం భారతదేశంలోని ఆదివారం ఉత్తరప్రదేశ రైలు ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం పట్ల సంతాపంవ్యక్తం చేశారు.  మెజెస్టి కింగ్ హేమాడ్  బిన్ ఇసా అల్ ఖలీఫా రైలుప్రమాదంలో మరణించిన బాధితుల గూర్చి భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో తమ సంతాపం ప్రకటించారు.ఎడబాటుకు గురైనవారి బాధితుల  కుటుంబాలకు ఓదార్పు మరియు గాయపడినవారు త్వరగా కోలుకోవాలని మెజెస్టి కింగ్ హేమాడ్  బిన్ ఇసా అల్ ఖలీఫా  భావించారు. విషాద ఘట్టంలో భారతదేశానికి  ప్రతికూలంగా ఉంటుందని  ఈ సమయంలో బహరేన్ తన పూర్తి సంఘీభావం ప్రకటిస్తుందని  పునరుద్ఘాటించారు.ప్రధాని  ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా ప్రమాదం గూర్చి భారతదేశ అధ్యక్షుడికి ముఖర్జీకి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. అదేవిధంగా భారత ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, భారత ప్రధాని  నరేంద్ర మోడీకి తన  సంతాపం ప్రకటించారు. గాయపడిన క్షతగాత్రులు వేగవంతంగా కోలుకోవాలని ఆయన కోరుకున్నారు. క్రౌన్ ప్రిన్స్, డిప్యూటీ సుప్రీం కమాండర్ మరియు మొదటి ఉప ప్రధాన మంత్రి శ్రీ శ్రీ  ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా కూడా అధ్యక్షుడు ముఖర్జీకి తమ సంతాపం ప్రకటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com