మద్యం మత్తులో ప్రముఖ నటుడు
- November 21, 2016
కృష్ణవంశీ కెరీర్ లో మైలురాయిగా నిలిచిన చిత్రం అంతపురం. సౌందర్య , జగపతి బాబు , ప్రకాష్ రాజు కీలక పాత్రలు పోషించి ఈ చిత్రం కల్ట్ క్లాసిక్ గా నిలిచింది. ముఖ్యంగా ఈ సినిమాలో జగపతి బాబు పాత్ర హైలట్ గా నిలిచింది. ఇందులో సరికొత్త జగపతి బాబును తెరపై ఆవిష్కరించారు కృష్ణవంశీ. ఇప్పటికీ ఆ పాత్ర తన కెరీర్ లో స్పెషల్ అని చెబుతుంటారు జగపతి బాబు.
అసలు ఆ పాత్ర అంతలా పండడానికి కారణం తెలిస్తే షాక్ అవుతారు. ఆ పాత్ర సంబధించిన సీన్లు తీస్తున్నప్పుడు జగపతి బాబు మందులో వుండేవారట. ఈ విషయాన్ని స్వయంగా కృష్ణవంశీ వెల్లడించారు. అంతపురం సినిమా చేస్తున్నప్పుడు జగపతి బాబుకు ప్రతీ సీన్ కి ముందు 'టకీలా' ఇచ్చేవాడిని.అది తాగిన తర్వాత సీన్ తీసేవాడిని. ఆ పాత్రలో చాలా వైవిధ్యమైనది. ఇందులో రియల్ సోల్ బయటికి రావాలి. ఎంత యాక్ట్ చేసిన మన బిహేవియర్ తెలిసిపోతుంది.
అందుకే సీన్ లో ఇంకా ఇంపాక్ట్ రావడానికి అలా చేయాల్సి వచ్చింది. నేనే కాదు. చాలా మంది ఫిల్మ్ మేకర్లు ఇలా చేస్తారు. రీసెంట్ టైంలో 'త్రి ఇడియట్స్' లో కూడా అమీర్ ఖాన్ మందుకొట్టి ఓ సీన్ చేశారు.
ఇంటర్వెల్ కు ముందు ఫ్రెండ్స్ అంతా కెరీర్ ను డిసైడ్ చేసుకొనే సీన్ లో అది కనిపిస్తుంది" అని ఫిల్మ్ మేకింగ్ సీక్రెట్ చెప్పారు కృష్ణవంశి.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







