పెట్టుబడుల కోసం విదేశాలకు వెళ్లనున్న ఏ.పి సియం
- November 21, 2016
పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం విదేశాల్లో నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సన్నద్ధమవుతున్నారు.అందులో భాగంగా ఈ నెల 29,30 తేదీల్లో ఆయన సింగపూర్ లో ,డిసెంబర్ 2,3 తేదీల్లో దుబాయ్ ,కువైట్ లలో పర్యటించనున్నారు.జనవరి ఆఖర్లో విశాఖపట్నంలో జరిగే సీఐఐ భాగస్వామ్య సదస్సుకు ముందుగా వివిధ దేశాల్లో పర్యటించి పెట్టుబడుల్ని ఆకర్షించాలన్న ప్రణాళికలో భాగంగా చంద్రబాబు ఈ దేశాల్లోని పారిశ్రామికవేత్తలతో సమావేశం కావాలని భావించారు.ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆధ్వర్యంలోని బృందం ఈ నెల 27 నుంచి వచ్చే నెల మూడో తేదీ వరకు ఆస్ట్రేలియా,న్యూజిలాండుల్లో పర్యటించబోతోంది.ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు(ఈడీబీ) చైర్మన్ కృష్ణ కిషోర్ ఆధ్వర్యంలోని బృందం ఇప్పటికే కొన్ని దేశాల్ని సందర్శించి పారిశ్రామిక సంస్థలతో సంప్రదింపులు జరిపింది.భాగస్వామ్య సదస్సు జరిగేలోగా మరికొన్ని దేశాల్లో పర్యటించబోతోంది.
తాజా వార్తలు
- భారత జట్టు తదుపరి మ్యాచ్ల షెడ్యూల్ ఇదే..!
- బెంగళూరులో రేపటి నుంచి హోటళ్లు బంద్
- ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా దుబాయ్–వరుసగా ఆరవ సంవత్సరం గుర్తింపు
- తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..
- అమరవీరులకు కువైట్ కన్నీటి నివాళి: సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు
- లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పై విపక్షాలు అవిశ్వాస తీర్మానం
- యూఏఈలో హెలికాప్టర్ ప్రమాదం: ఇద్దరు సాయుధ దళాల సిబ్బంది మృతి
- గల్ఫ్ దేశాల్లో 12వ తరగతి పరీక్షలు వాయిదా–CBSE కీలక నిర్ణయం
- 23400 ఉల్లంఘనలు..1,200 వాహనాలు సీజ్..!!
- వీడియోలు, ఫోటోలు షేర్.. 313 మంది అరెస్టు..!!









