నజ్మాలో దొంగతనానికి యత్నం
- November 21, 2016
నజ్మా ప్రాంతంలో అల్ తుమాయా లేన్‌లోని ఓ షాప్‌లో కొందరు దుండగులు దొంగతనానికి యత్నించారు. అయితే దొంగలు గ్లాస్ డోర్‌ని ఓపెన్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా వెలువడిన శబ్దాలకు స్థానికులు అప్రమత్తమై, అక్కడికి వెళ్ళగా అది గమనించిన దొంగలు పారిపోయారు. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు తెలియజేశారు. తుమాయా పరిసరాల్లో ఈ తరహా దొంగతనాలు ఇటీవలి కాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి. చలికాలం కావడంతో తొందరగా ప్రజలు నిద్రకు ఉపక్రమిస్తుంటారు. ఇది అదనుగా చేసుకుని దొంగలు, దొంగతనాలకు యత్నిస్తుండడం జరుగుతుంది. దొంగతనాలకు సంబంధించి పలు ఫిర్యాదులు వస్తున్నాయనీ, వాటిని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







