సూపర్‌స్టార్ మోహన్‌లాల్ మోదీ పై ప్రశంసలు కురిపించారు...
- November 21, 2016
నల్లధనం నిర్మూలనకు ప్రధాని నరేంద్రమోదీ పెద్దనోట్లు రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంపై మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ ప్రశంసలు కురిపించారు. 'పెద్ద నోట్లు రద్దు అనే నిర్ణయాన్ని నేను సర్జికల్ స్ట్రైక్‌లానే భావిస్తున్నాను. నేను నేతల్ని పూజించను. కానీ ఆ నేతలు తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తాను. ఇప్పుడు మోదీ తీసుకున్న నిర్ణయం కూడా అలాంటిదే. పెద్ద నోట్ల రద్దు వల్ల తాత్కాలికంగా ఇబ్బందులు ఎదురైనా మున్ముందు మంచి జరుగుతుందని నాకు అర్థమైంది. ఇలాంటి ఓ పెద్ద నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు దాని ప్రభావం కనిపించకుండా పోదు. డబ్బు కోసం గంటల తరబడి బ్యాంకు ఎదుట బారులు తీరుతున్న ప్రజల బాధను నేను అర్థంచేసుకోగలను.కానీ మద్యం దుకాణాలు, సినిమా థియేటర్లు, గుళ్లుగోపురాల ఎదుట కూడా గంటలు తరబడి నిలబడుతుంటాం. అలాగే మున్ముందు జరగబోయే మంచి కోసం కొద్ది గంటల పాటు నిలబడినా నష్టం లేదని నా అభిప్రాయం' అంటూ మోహన్‌లాల్ తన బ్లాగులో రాసుకొచ్చారు.
తాజా వార్తలు
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్







