'బాహుబలి 2' లీక్ చేసిన వ్యక్తి అరెస్ట్
- November 22, 2016
'బాహుబలి: ద కన్‌క్లూజన్' చిత్రంలోని 9 నిమిషాల సన్నివేశాలు ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమవడం సంచలనం సృష్టిస్తోంది. 'బాహుబలి: ద బిగినింగ్'కు కొనసాగింపుగా దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకోగా నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో 'బాహుబలి 2'లోని 9 నిమిషాల నిడివిగల వీడియో ఆన్‌లైన్‌లో ప్రత్యక్షకావడంతో చిత్ర బృందం ఒక్కసారిగా ఖంగుతింది. దీనిపై చిత్ర నిర్మాత జూబ్లీహిల్స్ పోలీసులతో పాటు, సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. చిత్ర బృందంలో గ్రాఫిక్ డిజైనర్‌గా పనిచేస్తున్న కృష్ణ అనే వ్యక్తి ఈ చర్యకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలడంతో నిందితుడిని విజయవాడలో అరెస్టు చేశారు. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రలు పోషించిన 'బాహుబలి' ప్రపంచవ్యాప్తంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని నమోదు చేసింది. దీనికి కొనసాగింపుగా తెరకెక్కిన 'బాహుబలి: ద కన్‌క్లూజన్' ఏప్రిల్ 28 2017న విడుదల కానుంది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







