కోకాకోలా, పెప్సీ కంపెనీలకు నో చెప్పిన జయ సర్కారు
- November 22, 2016
తమిళనాడు ప్రభుత్వం సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకుంది. బహుళ జాతి సంస్థల ఒత్తిళ్లకు తలొగ్గకుండా స్థానికులకే పెద్దపీట వేసింది. సాఫ్ట్ డ్రింక్స్ తయారు చేయడానికి నీళ్లు ఇవ్వబోమంటూ కోకాకోలా, పెప్సీ కంపెనీలకు నో చెప్పేసింది జయ సర్కార్. ఈ వ్యవహారంపై కొన్నాళ్లుగా ఆ రాష్ర్టంలో ఆందోళనలు జరుగుతున్న విషయం తెల్సిందే! నార్మల్‌గా సాఫ్ట్‌డ్రింక్ తయారీ యూనిట్ స్థాపించాలంటే ఒక లీటర్‌కు భారీ మోతాదులో నీళ్లు అవసరం అవుతాయి. అసలే నీటి కొరతతో ఇబ్బందులు పడుతోంది తమిళనాడు. నీటి కోసం పొరుగురాష్ర్టాలతో ఆందోళనకు దిగిన సందర్భాలు లేకపోలేదు. ఈ నేపథ్యంలో ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అన్నాడీఎంకె వర్గాలు చెబుతున్నాయి.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







