అమ్నెస్టీ: 9,000 అక్రమ నివాసితులు స్వదేశాలకి
- November 24, 2016
మూడు నెలల అమ్నెస్టీ కారణంగా 9000 మంది అక్రమ నివాసితులు ఖతార్‌ని వీడే అవకాశాలు ఉన్నాయని సీనియర్ ఇమ్మిగ్రేషన్ అధికారులు వెల్లడించారు. ముందుగా ఇంత పెద్ద మొత్తంలో అమ్నెస్టీ కోసం దరఖాస్తులు వస్తాయనుకోలేదనీ, అయితే రాను రాను అమ్నెస్టీని ఆశ్రయించినవారి సంఖ్య పెరిగిందని, 9000 మంది దేశాన్ని వీడనున్నట్లు తాము అంచనా వేస్తున్నామని బ్రిగేడియర్ అబ్దుల్లా జబెర్ అల్ లబ్దా చెప్పారు. వర్క్ వీసా లేకుండా విదేశీయులు దేశంలో పని చేయడం ఖతారీ చట్టాల ప్రకారం అక్రమం, నేరం. ఖఫలా స్పాన్సర్ చట్టాల ప్రకారం ఎవరైనా తమ ఉద్యోగాన్ని మార్చుకోవాలనుకుంటే, ఖచ్చితంగా యజమాని నుంచి అనుమతి పొందవలసి ఉంటుంది. చాలా సందర్భాల్లో యజమానికి చెప్పకుండా వేరే ఉద్యోగాల్ని స్నేహితుల ద్వారా వెతుక్కుని, దేశంలో అక్రమ నివాసితులుగా మారిపోతున్నారు. అలాంటివారికి భవిష్యత్తులో కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ సంఘాల అభ్యర్థన మేరకు ప్రభుత్వం అమ్నెస్టీని కల్పిస్తోంది.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







