రూపాయితో పోల్చితే డాలర్‌ కొత్త రికార్డ్‌

- November 24, 2016 , by Maagulf
రూపాయితో పోల్చితే డాలర్‌ కొత్త రికార్డ్‌

ముంబై: భారత కరెన్సీ రూపాయితో పోల్చినప్పుడు డాలర్‌ కొత్త రికార్డుని చేరుకుంది. భారత ప్రభుత్వం కరెన్సీ రద్దు నిర్ణయం తర్వాత రూపాయి తీవ్రమైన ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. ఈ క్రమంలోనే మూడు నెలల కనిష్ట స్థాయికి రూపాయి విలువ డాలర్‌తో పోల్చినప్పుడు పడిపోయింది. 2013లో 68.845కి పడిపోయిన రూపాయి విలువ, ఇప్పుడు మళ్లీ ఆ మార్క్‌ని చేరుకుంది. నల్లధనాన్ని నియంత్రించేందుకోసం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం రూపాయికి ఇబ్బందికరంగా మారింది. అయితే కొన్ని రోజులు ఈ ఇబ్బందికర పరిస్థితి ఉంటుందనీ భవిష్యత్తులో భారత ఎకానమీ అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆర్థిక నిపుణులు మాత్రం కరెన్సీ సంక్షోభంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంకో వైపున ట్రంప్‌ గెలుపుతో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటుందనుకున్న డాలర్‌ అనూహ్యంగా బలపడ్తోంది. అది కూడా రూపాయి బలహీనమవడానికి కారణంగా అంచనా వేస్తున్నారు. ట్రంప్‌ గెలిచిన తర్వాత 2.92 శాతం రూపాయి విలువ పతనమయ్యింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com