పసిడి కూడా అతలా కుతలమవుతోంది...

- November 24, 2016 , by Maagulf
పసిడి కూడా అతలా కుతలమవుతోంది...

 ట్రంప్ విక్టరీ, ఫెడ్ అంచనాలు, ఎగబాకుతున్న డాలర్ విలువ, దేశంలో డీమానిటైజేషన్ ప్రకంపనల నేపథ్యంలో విలువైన లోహం పసిడి కూడా అతలా కుతలమవుతోంది. కీలకమైన మద్దతు స్థాయిల కిందకి దిగజారి రికార్డ్ స్థాయి కనిష్టాన్ని నమోదు చేసింది. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు పతనమవుతుంగా దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ ఒడిదుడుకుల మధ్య కొనసాగుతున్నాయి. మరోవైపు దేశీయ కరెన్సీ రూపాయి డాలర్ మారకపు విలువో రికార్డ్ స్తాయి కనిష్టాన్ని నమోదు చేసింది. బంగారం, వెండి ధరలు కూడా దాదాపు ఇదే బాటలో పయనిస్తున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లు బలహీన నేపథ్యంలో గోల్డ్ ఫ్యూచర్స్ లో అమ్మకాలు వెల్లువెత్తాయి. దీంతో గురువారం పసిడి నేల చూపులు చూస్తోంది.

ఏంసీఎక్స్ మార్కెట్ లో 10 గ్రాముల బంగారం రూ169లు క్షీణించి రూ 28,662 వద్ద కొనసాగుతోంది. సుమారు 2 శాతం పడిపోయిన పసిడి తొమ్మిదిన్నర నెలల కనిష్టానికి చేరింది. అలాగే ఔన్స్ సిల్వర్ ధర 0.6 శాతం క్షీణించింది. వెండికిలో ధర రూ. 40,123గా ఉంది. ప్లాటినం ధరలు 1.3 శాతం పడిపోయాయి. పల్లాడియంమాత్రం 0.2 శాతం పెరిగింది. 
అయితే గోల్డ్ ఫ్యూచర్స్ లో బలహీనత కొనసాగనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. విలువైన మెటల్ ధరలు తొమ్మిది నెలల కనిష్టానికి చేరడం బలహీన సంకేతమని..అప్రమత్తంగా ఉండాలని ట్రేడర్లకు సూచిస్తున్నారు. ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు ఖాయమన్న అంచనాలతో మదుపర్లు డాలర్ల కొనుగోళ్ల వైపు మళ్లారని అభిప్రాయపడ్డారు. సింగపూర్ లో బంగారం ధరలు 0.5 శాతం పతనమైంది. ఔన్సు పసిడి ధర 1,182.95 డాలర్లకు చేరింది.

 

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com