చైనాలోని జియాంగ్జి ప్రావిన్స్‌లో ఘోర ప్రమాదం...
- November 24, 2016
చైనాలోని జియాంగ్జి ప్రావిన్స్‌లో గురువారం ఉదయం ఘోర ప్రమాదం చేసుకుంది. నిర్మాణంలో ఉన్న పవర్ ప్లాంట్ కూలి 22 మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. కార్మికులు విధుల్లో ఉన్న సమయంలో ప్లాంట్ ఒక్కసారిగాఒక్కసారిగా కుప్పకూలడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. శిథిలాల కింద ఎక్కువ మంది చిక్కుకున్నట్లు చైనాకి చెందిన న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. సహాయ సిబ్బంది శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించే పనిలో నిమగ్నమయ్యారు. కాంక్రీటు పలకలు విరగడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన ధూళి వ్యాపించింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.
చైనాలో పారిశ్రామిక ప్రమాదాలు జరగడం సాధారణంగా మారిందిసరైన జాగ్రత్తలు తీసుకోకుండా కట్టడాలు నిర్మించడంతో తరుచూ ప్రమాదాలు జరిగి ఎంతో మంది ప్రాణాలను బలిగొంటున్నాయి. ఆగస్టు నెలలో జరిగిన పైప్‌లైన్ పేలుడు కారణంగా 21 మంది మృతి చెందారు. గతేడాది ఓ ప్లాంట్‌లో రసాయనాలు విడుదల కారణంగా 130 మంది అస్వస్థకు గురయ్యారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







