సౌదీలో స్టాండర్డ్ ఇండియన్ వర్కర్స్‌కి చిన్ని ఆశ
- November 25, 2016
సౌదీ ఒగెర్ మరియు సాద్ గ్రూప్ తదితర నిర్మాణ సంస్థల్లో పనిచేస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారతీయ వలసదారులను ఆదుకునేందుకు తగు చర్యలు తీసుకుంటామని సౌదీ అరేబియా, భారత ప్రభుత్వానికి భరోసా ఇచ్చింది. లోక్‌సభలో మినిస్టర్ ఆఫ్ ఎక్సటర్నల్ ఎఫైర్స్ వికె సింగ్ చెబుతూ, సౌదీ అరేబియా, భారతీయ కార్మికుల ఎగ్జిట్ వీసాలను ఎక్స్‌టెండ్ చేయనున్నట్లు ప్రకటించిందనీ, అలాగే వన్ వే రిటర్న్ టికెట్‌ని ఇవ్వనున్నట్లు తెలిపిందనీ, రెసిడెంట్ పర్మిట్ జరీమానాల్ని ఎత్తివేయనున్నట్లు చెప్పిందనీ ఓ ప్రశ్నకు సమాధానంగా వివరించారు. భారతీయ కార్మికుల్ని ఆదుకునేందుకు తగు రీతిలో సహాయ సహకారాలు అందిస్తామని భారత ప్రభుత్వానికి సౌదీ ప్రభుత్వం తెలిపిందని చెప్పారాయన. రిపాట్రియేషన్ ఇప్పటికే ప్రారంభమైందనీ 4,358 మంది ఇప్పటికే స్వదేశానికి వచ్చారని సింగ్ చెప్పారు. కాగా ఖతార్‌లో వందలాదిమంది కార్మికులు ఇంకా ఎలాంటి పేమెంట్స్ లేకుండా ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. కోచి, హైద్రాబాద్, గురుగ్రామ్, చెన్నయ్, లక్నోలలో మైగ్రెంట్ రిసోర్స్ సెంటర్స్‌ని ఏర్పాటు చేస్తున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







