ఇద్దరు అన్నదమ్ముల కథ
- August 31, 2015
ఒక ఊరిలో చిన్న పుల్లయ్య, పెద్ద పుల్లయ్యా అని ఇద్దరు అన్నదమ్ములుండేవారు. వారిలో పెద్దవాడు కొంచెం అమాయకుడు. చిన్నవాడు తెలివైన వాడు. వారికి అడవి పక్కన రెండెకరాల పొలం ఉంది. అదే వారిద్దరికీ జీవనాధారం. ఆ ఏడాది పొలంలో వారు దోసతోట వేశారు. కాయలు బాగాకాశాయి. కాసిన కాయల్ని చిన్నవాడు సంతకి తీసుకెళ్లి అమ్ముకుని వచ్చేవాడు. పెద్దవాడు పొలానికి కాపలా ఉండేవాడు. ఒకరోజు అన్నయ్యని చూసి ఏంటి అన్నయ్యా అలాగున్నావు. తిండి తినడంలేదా ఏంటీ అని ఆడిగితే అన్న, తమ్ముడితో పొలంలోకి రాత్రిళ్లు రోజూ ఒక పెద్దపులి వస్తుంది.అది నన్ను ఏమీ చేయట్లేదు కానీ వచ్చి గుడిసెలో కూర్చొని నేనిచ్చే దోసకాయలు తింటూ దాని వీపు గోకించుకుంటుంది. దాంతో నాకు రోజూ నిద్ర పుండడంలేదురా అన్నాడు. అప్పుడు తమ్ముడు ఒక ఉపాయం ఆలోచించి ఒకరోజు అన్నని సంతకి పంపించి, ఆ రాత్రికి తాను గుడిసెలోపడుకున్నాడు. పెద్దపులి రానే వచ్చింది. వచ్చి రోజూలాగే తన పని చేయించుకోవాలనుకుంది. నడ్డి గోకుతూ, మధ్యలో మంచి నీళ్లు తాగొస్తానని చెప్పి చిన్నపుల్లయ్య లోపలికి వెళ్ళాడు. అప్పటికే నిప్పుల్లో ఎర్రగా కాల్చి పెట్టిన అట్ల కాడను తెచ్చి పులి వీపు మీద వాతలు వేశాడు. అంతేకుయ్యో మొర్రో అనుకుంటూ పెద్దపులి అక్కడినుండి పారిపోయింది. మళ్లీ అటువైపు రాలేదు. అప్పట్నుంచీ అన్నదమ్ములకు పెద్దపులి పీడ వదిలిపోయింది. ఇద్దరూ ఆరోగ్యంగా దోసతోటను సాగు చేసుకుంటూ హాయిగా జీవించసాగారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







