వెజిటేబుల్ పులిహోర
- August 31, 2015
బియ్యం - రెండు కప్పులు
తాజా బఠానీలు - అరకప్పు
బీన్స్, క్యారెట్, బంగాళాదుంపలు, క్యాప్సికమ్ - అరకప్పు చొప్పున
అల్లం తురుము - కొద్దిగా
పచ్చిమిర్చి - నాలుగు
తాలింపు సామాన్లు - సరిపడా
కరివేపాకు - కొద్దిగా
నూనె - తగినంత
ఉప్పు - తగినంత
నిమ్మరసం - రెండు స్పూన్లు
తయారీ విధానం
అన్నం ఉడికించి వెడల్పాటి గిన్నెలో వేసి ఆరనివ్వాలి. నిమ్మరసంలో ఉప్పు కలిపి అన్నానికి పట్టించాలి. కొద్దిగా కరివేపాకు కూడా పచ్చిగా వేసి కలపాలి. కూరగాయ ముక్కలనన్నింటినీ కొద్దిగా నీరు పోసి ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ఆ నీటిని వంపి పక్కన పెట్టాలి. పచ్చిమిర్చి, అల్లంనుకచ్చాబిచ్చాగా రుబ్బాలి. ఒక బాణలిలో నూనె వేసి దానిలో తాలింపు దినుసులు ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శెనగపప్పు, పల్లీలు వేసి వేయించి, దానిలో ఉడికించిన కూరగాయల ముక్కలు, పచ్చిమిర్చి పేస్ట్, అన్నీ వేసి కొద్దిగా వేయించి, చివరిగా కొద్దిగా ఇంగువా, మిరియాల పొడి వేసికలిపి ఈ మొత్తం వేయించిన మిశ్రమాన్ని అన్నంలో కలిపేస్తే వెజిటెబుల్ పులిహోర రెడీ.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







