సిరియన్ల "బాల్" ద్వంశం
- August 31, 2015
చరిత్రాత్మక ఆలయాన్ని ద్వంసం చేసిన ఐఎస్ఐఎస్ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు మరోసారి చారిత్రాత్మక ఆలయాన్ని నేల మట్టం చేశారు. రెండు వేల ఏళ్ళ నాటి చరిత్రను కాల గర్భంలో కలిపేశారు. పురాతన క్షేత్రం వద్ద కొలువై ఉన్న సిరియన్ల ప్రముఖ దైవం బాల్ ఆలయాలను ఒక్కొక్కటీగా ధ్వంసం చేస్తున్నారు. గతవారం ఓ ఆలయాన్ని బాంబు దాడులో కూల్చివేయగా.. తాజాగా మరో ప్రముఖ పురాతన ఆలయాన్ని ధ్వంసం చేసి నేలమట్టం చేశారు. ఈ ప్రాంతానికి యునస్కో హెరిటేజ్ గుర్తింపు కూడా ఉంది. క్రీ.శ 32లో నిర్మించిన ఈ ఆలయానికి దాదాపు రెండు వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ ఘటనను పరిశీలించిన స్థానికుడు అదొక మహా విస్ఫోటనంగా అభివర్ణించాడు. వారు పేల్చిన బాంబుకు వెలువడిన శబ్ధం విన్నవారి చెవులకు చిల్లులు పడాల్సిందే, వినికిడి లోపం సమస్య తలెత్తాల్సిందే అని చెప్పారు. శాటిలైట్ లో కూడా ఆలయం ధ్వంసం సమయంలో ఏర్పడిన దుమ్ము దూళి పొగ భారీగా ఎగిసిపడటం కనిపించింది.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







