క్లీనింగ్ ఉద్యోగం కోసం ఎంబీఏ, ఎంసీఏ విద్యార్థులు సిద్ధం
- November 26, 2016
ఈ ఫొటోలో కనిపిస్తున్న వారంతా ఈ నెల 25న జగిత్యాల జిల్లా కేంద్రంలో ఓ కన్సల్టెన్సీ నిర్వహించిన గల్ఫ్ ఉద్యోగాల ఇంటర్వ్యూకు వచ్చిన నిరుద్యోగులు. అబుదాబీలోని నేషనల్ హోటల్స్‌లో 500 పోస్టుల భర్తీ కోసం సదరు కంపెనీ నిర్వహించిన జాబ్‌మేళాలో ఏడొందలకుపైగా మంది హాజరయ్యారు. ఏ ప్రకటన లేకుండానే కన్సల్టెన్సీ నిర్వహించిన జాబ్‌మేళా ఇది. ఒకవేళ పత్రిక ప్రకటన ఇస్తే.. వెయ్యి మందికిపైనే ఇంటర్వ్యూకు హాజరయ్యేవారని నిరుద్యోగులు చెప్పారు. ఇందులో మరో విశేషమేమిటంటే..! ఈ పోస్టులన్నీ హోటళ్లలో క్లీనింగ్ సెక్షన్లో మాత్రమే. ఎడారి దేశంలో.. క్లీనింగ్ ఉద్యోగం కోసం ఎంబీఏ, ఎంసీఏ విద్యార్థులు సైతం సిద్ధం కావడం విశేషం.
ఇంతకు ఈ ఉద్యో గాలకు అక్కడి యాజమాన్యం నిర్ణరుుంచిన వేతనం.. 950 దినార్లు (ఇక్కడి రూ.17,100) మాత్రమే. సంబంధిత హోటల్ ప్రతినిధులూ ఈ ఇంటర్వ్యూలకు హాజరయ్యారు.
ఇక్కడ పనుల్లేక... పరాయిదేశంలో పనుల్లేక.. వందలాది మంది స్వదేశానికి తిరిగి వస్తున్నా గల్ఫ్ దేశంలో పని చేసేందుకు యువత సిద్ధమ వుతోంది. ఇప్పటికే సౌదీలోని జెడ్డా, రియాద్, దమామ్లలో ఉన్న బిన్‌లాడెన్ వంటి పెద్ద కంపెనీలు మూతబడ్డారుు. అబుదాబీ, ఒమన్, ఖతర్, మస్కట్, షార్జా ల్లో ఉన్న ప్రముఖ కంపెనీలు మూతబడే దిశలో ఉన్నాయి. దీంతో యాజమాన్యాలు కార్మికులను పనిలోంచి తొలగిస్తున్నాయి. గల్ఫ్ నుంచి మూడు నెలల వ్యవధిలో 60వేలకు పైగా మంది తిరిగొచ్చేశారు.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









