ఫిబ్రవరి 24న 'విన్నర్‌

- November 27, 2016 , by Maagulf
ఫిబ్రవరి 24న  'విన్నర్‌

సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా రూపొందుతున్న చిత్రం 'విన్నర్‌'. గోపీచంద్‌ మలినేని దర్శకుడు. లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్‌ నిర్మిస్తోంది. నల్లమలుపు శ్రీనివాస్‌ (బుజ్జి), ఠాగూర్‌ మధు నిర్మాతలు. రకుల్‌ ప్రీత్‌సింగ్‌ నాయికగా నటిస్తోంది. విన్నర్‌ కోసం ఇటీవల విదేశాల్లో షూటింగ్‌ చేశారు. దర్శకుడు మాట్లాడుతూ "నవంబర్‌ 3 నుండి 20 వరకు ఉక్రెయిన్‌లో పాటలను చిత్రీకరించడం జ రిగింది. సాయిధరమ్‌, రకుల్‌ ప్రీత్‌సింగ్‌పై రెండు పాటలను, సాయిధరమ్‌, యాంకర్‌ అనసూయపై మరో పాటను చిత్రీకరించాం. రాజు సుందరం నృత్యరీతులు సమకూర్చారు. ఈ పాటలను రామజోగయ్య శాస్త్రి, అనంతశ్రీరామ్‌, శ్రీమణి రాశారు. టర్కీలోని ఇస్తాంబులలో పతాక సన్నివేశాలకు సంబంధించిన చిత్రీకరించాం.అలాగే బల్గేరియన్‌ ఫైట్‌ మాస్టర్‌ కలయూన్‌ ఆధ్వర్యంలో యాక్షన్‌ సన్నివేశాలను తెరకెక్కించాం. బాహుబలిలో మంచుకొండల్లో జరిగే యాక్షన్‌ ఎపిసోడ్‌ చిత్రీకరించింది కలయాన్‌ కావడం విశేషం. డిసెంబర్‌ 6 నుండి ఊటీ, బెంగళూరులో షెడ్యూల్‌ జరుగుతుంది. అక్కడ కీలక సన్నివేశాలు, యాక్షన్‌ పార్ట్‌ తీస్తాం.
జనవరిలో బ్యాలెన్స్‌ టాకీ, రెండు పాటల చిత్రీకరణ పూర్తిచేసి, మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 24న సినిమాను విడుదల చేస్తాం" అని చెప్పారు. నిర్మాతలు మాట్లాడుతూ "తనకు జన్మనిచ్చిన తండ్రిని, మనసిచ్చిన అమ్మాయిని గెలవడం కోసం ఓ యువకుడు పోరాటం చేస్తాడు. అందులో గెలిచి విన్నర్‌గా ఎలా నిలిచాడనేది చిత్రకథ. తమన్‌ మంచి బాణీలు ఇచ్చారు.ఇందులో ఐదు పాటలు, ఒక బిట్‌ పాట ఉంటుంది. అన్ని వర్గాలవారికి నచ్చే విధంగా సినిమాను తీర్చిదిద్దుతున్నాం" అని చెప్పారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం చోటా కె.నాయుడు, సంగీతం తమన్‌, కథ వెలిగొండ శ్రీనివాస్‌, రచన అబ్బూరి రవి, శ్రీధర్‌ సీపాన.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com