డిసెంబర్ 16న 'గౌతమిపుత్ర శాతకర్ణి' పాటలు విడుదల ..
- November 28, 2016
'గౌతమిపుత్ర శాతకర్ణి' చిత్రం అభిమానుల అంచనాలకు అనుగుణంగా తెరకెక్కించినట్లు నందమూరి బాలకృష్ణ తెలిపారు. గౌతమిపుత్ర శాతకర్ణి దేశం మొత్తానికి సంబంధించిన రాజని.. ఆయన చరిత్రను సినిమాగా తీయడం తన అదృష్టమన్నారు. మొరాకో, జార్జియా, మధ్యప్రదేశ్ వంటి ప్రాంతాల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు చెప్పారు. ప్రస్తుతం రీరికార్డింగ్, డబ్బింగ్, గ్రాఫిక్స్ పనులు శరవేగంగా సాగుతున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రం పాటలు, ట్రైలర్ను డిసెంబర్ 16న విడుదల చేయాలని భావిస్తున్నట్లు బాలకృష్ణ చెప్పారు. గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రం ఘనవిజయం సాధించాలని ఆకాంక్షిస్తూ ఫిలింనగర్లోని దైవసన్నిధానంలో మహారుద్రాభిషేకం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి బాలకృష్ణ, దర్శకుడు క్రిష్, చిత్ర యూనిట్ హాజరయ్యారు.
తాజా వార్తలు
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!
- రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చట్ట సవరణపై సమీక్ష..!!
- యూఏఈలో భారత పాస్పోర్ట్, వీసా సేవలు..అల్హింద్ కు కాంట్రాక్ట్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..









